- Advertisement -
- – తప్పుడు పత్రాలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం..
– భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ - నవతెలంగాణ – మణుగూరు: మణుగూరు ఓసి విస్తరణలో భాగంగా తిర్లాపురం రామనుజవరం గ్రామపంచాయతీ లలో ఎంజాయ్ మెంట్ సర్వేకు రైతులు సహకరిస్తున్నారని భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తిర్లాపురం గ్రామంలో సర్వే పూర్తయిందన్నారు ప్రస్తుతం రామనుజవరంలో సర్వే నడుస్తుంది అన్నారు. బాండ్ పేపర్ల ఒకరి నుంచి మరొకరి పేరు మీద రాస్తున్నారని తెలిసిందన్నారు తప్పుడు పత్రాలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబ సభ్యులు, రైతులు ఫీల్డ్ పై ఉండి ఎంజాయ్మెంట్ సర్వేలో బావులు చెట్లు బోరుబావులను నమోదు చేసుకోవాలన్నారు. తప్పుడు బాండ్ పేపర్లను ఫోరనిక్స్ ల్యాబ్ కు పంపిస్తామన్నారు దస్తూరి లపై విచారణ చేస్తామన్నారు. పాత బాండ్ పేపర్లును కొన్న వారిపై అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ నరేష్, ఆర్ ఐ గోపి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -