నవతెలంగాణ – పెద్దవూర
వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలతో జిల్లా ఉద్యాన శాఖ యంత్రాంగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పెద్దవూర మండల కేంద్రంలో సబ్ మార్కెట్ యాడ్ లో మంగళవారం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మరియు జిల్లా ఉద్యాన శాఖ వారి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయిల్ పామ్ పంటలపై పతంజలి కంపెనీ జిల్లా మేనేజర్ డాక్టర్ కూన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఉద్యాన వన రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలపారు. తెలంగాణల్ లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారితో భాగస్వామ్యం అవ్వాలని ఆదేశిందని అన్నారు.
ఈ యొక్క ఆర్థిక సంవత్సరం లో 2025-26 తెలంగాణ లో లక్ష ఇరువై ఐదు వేల ఎకరాలల్లో 1,25,000 ఆయిల్ పామ్ సాగు ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. దీంట్లో భాగంగానే, ఒక్క నల్లగొండ జిల్లాలో 6,500 ఎకరాల సాగు లక్ష్యంగా విధించిందని తెలిపారు.ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు ఏ పంట పైన కూడా ఆదాయం రావట్లేదని,వరి అయినా, పత్తి అయినా, బత్తాయి అయినా,కేవలం ఆయిల్ పామ్ పంటలోనే ఆదాయం ఉందిని అన్నారు. ఒక్క ఎకరం ఆయిల్ పామ్ తో సంవత్సరానికి లక్ష యభై వేల రూపాయల 1,50,000 నికర ఆదాయం పొందవచ్చని, నీరు సంవృద్ధిగా ఉన్న ప్రతి ఒక్క రైతు వరికి బదులుగా ఆయిల్ పామ్ నాటుకోవాలని సూచించారు.వరితో పోలిస్తే 4 రేట్లు ఆదాయం ఎక్కువ, 4 రేట్లు నీరు తక్కువ అని, ఎలాంటి ప్రకృతి విపరీత్యాలు వానలు, వరదలు వచ్చిన ఆయిల్ పామ్ పంటకి ఎటువంటి నష్టం వాటిల్లదని తెలిపారు.
మొక్కలపైఒక్క మొక్క కి రైతు 20రూపాయలు కడితే సరిపోతుందని,డ్రిప్ పై ఓసి రైతులకి – 80శాతం,బీసీ రైతులకు – 90 శాతం,ఎస్సి,ఎస్టీ రైతులకి – 100 శాతం పెట్టుబడి సహాయం ఎకరానికి – ఒక సంవత్సరానికి- 4200 ల చొప్పున నాలుగు సంవత్సరాల వరకు అంద జేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని వెంటనే ఆయిల్ పామ్ సాగు చేసుకున్నట్లయితే, రైతులయొక్క ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడతాయని సూచించారు.



