నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియా బుకింగ్ తో పాటు ఇతర విషయాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత పంట కాలంలో రైతులకు యూరియా కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఏర్పడగా రాష్ట్ర ప్రభుత్వం రైతు కలగకుండా యూరియా బుకింగ్ మొబైల్ యాప్ ని తీసుకువచ్చి ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ ఫోన్లలో ఇంటి నుండి వారికి నచ్చిన దుకాణాల్లో యూరియా బుకింగ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించారు.
ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు
1. రైతు ఇంటి వద్ద నుండే ఈ యాప్ ద్వారా తనకు దగ్గరలో ఉన్న దుకాణాలలో ఎంత మేరకు యూరియా నిలువలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
2. రైతులు యూరియా కొరత ఉన్నదని అపోహలో భయాందోళనలో దుకాణాలకు వెళ్లి యూరియా కొనాల్సిన అవసరం లేదు
3. పంట పండించిన నిజమైన రైతులు మాత్రమే తమకు నచ్చిన దుకాణానికి వెళ్లి యూరియా కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది.
4. యూరియా పంపిణీ రైతులు వేసిన పంటలను బట్టి సముచితంగా పారదర్శకంగా చేయబడుతుంది.
ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఉప సర్పంచ్ మాధవరావు, వ్యవసాయ విస్తరణ అధికారి భాను ప్రశాంత్, గ్రామ పాలనాధికారి సాయిలు, రైతులు పాల్గొన్నారు.



