Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం రైతన్న గోస 

యూరియా కోసం రైతన్న గోస 

- Advertisement -

ఒక సంచి యూరియా కోసం వేకువ జాము నుండి వరసలో 
కొనుగోలు చేసి బ్లాక్లో విక్రయాలు 
నవతెలంగాణ – రామారెడ్డి 

యూరియా కోసం రైతన్న గోస ఇంత అంత కాదు, ఇంటిలో ఉన్న భార్యాభర్తల తో పాటు, తల్లిదండ్రులు వరుసలో నిలబడి యూరియా కోసం గోస తప్పటం లేదు. మండలంలోని రెడ్డి పేట, అన్నారం గ్రామాల్లో యూరియా  పోలీస్ పహారాలో పంపిణీ చేశారు. కొద్దిసేపు మహిళా రైతులు మధ్య తోపులాట జరిగింది. ప్రతిరోజు దినచర్యగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవసరం లేకుండా యూరియాను కొనుగోలు చేసి రూ 500 నుండి 700 వరకు బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అలాంటి వారిపై చర్యలు తీసుకొని, కావలసిన రైతులకు యూరియా అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -