ఆపూర్వ విద్యార్థుల సమ్మేళనం..

నవతెలంగాణ -మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1995- 96 సంవత్సరంలో పదవ తరగతి చదివిన ఆపూర్వ విద్యార్థులు ఆదివారం తాడిచర్ల హైస్కూల్లో గెట్టు గెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు గట్టు మధుకర్, వానమాముల కృష్ణమాచారి, మల్క భాస్కరరావు, సార్ల రాజయ్య, సుంకరి సారయ్య, మల్క రామ్ కిషన్ రావు, కటకం ప్రకాష్ రావు, అంబాల శంకరయ్య అనే ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు నేడు ఆటపాటలతో అలరించారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా వ్యక్తం చేశారు ఒకరినొకరు వ్యక్తిగత జీవిత చరిత్రను తెలుసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పలకరించుకున్నారు. అనంతరం అప్పుడు విద్యను అందికచిన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు సత్కరించారు.
Spread the love