- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య ను కాంగ్రెస్ నాయకులు మహేందర్ తోపాటు పలువురు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం మళ్ళీ పాత పాలక వర్గాలకు పగ్గాలు అప్పజెప్పిన నేపథ్యంలో మొoడయ్య మళ్ళీ చైర్మన్ బాధ్యతలు చేపట్టడం ద్వారా తాడిచెర్ల సొసైటీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.
- Advertisement -



