నవతెలంగాణ- హైదారబాద్ : టీపీసీసీలో పలు కీలక నియామకాలు జరిగాయి. టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెంను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది. అలాగే మీడియా, పబ్లిసిటీ విభాగం ఛైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్‌గా పనిచేసిన నవీన్ పెత్తెం, ప్రస్తుతం రాష్ట్ర రవాణా అథారిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనతో పాటు సోషల్ మీడియా విభాగానికి కన్వీనర్లుగా కె.ఉజ్వల్ రెడ్డి, పి.వంశీకృష్ణలను నియమించారు. అంబాల శివకుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, వీరాపురం రామ్ లక్ష్మణ్, గీత అయినాల, ఎండీ అబిద్ అలీ, సుశీల్ కుమార్‌లను కోఆర్డినేటర్లుగా ఎంపిక చేశారు.


