- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10న నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ‘వరుణ యాగం’ నిర్వహించాలని నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, పండితులు ఈ యాగం నిర్వహణకు ముహూర్తం ఖరారు చేశారు. నదులు, చెరువులు జలకళతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేదే ఈ ప్రత్యేక పూజల ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
- Advertisement -



