Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబావిలో సముద్రపు అలలు..!

బావిలో సముద్రపు అలలు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్పర్డా గ్రామంలో ఉన్న ఓ రైతు బావిలో నీరు సముద్రపు అలల్లా ఎగసిపడుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆగస్టు 2 నుంచి బావిలో నీరు భారీ అలల్లా ఊగిపోతూ, కొన్నిసార్లు పైకి పొంగిపొర్లుతోంది. అయితే సమీపంలోని ఇతర బావుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. భూకంపం కారణమేమోనని తొలుత అనుమానించినా, జిల్లా జియాలజిస్టులు ఆ వాదనను ఖండించారు. భారీ వర్షాలతో భూగర్భ జలాలు వేగంగా రీఛార్జ్ కావడం, రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి ఒత్తిడితో బయటకు రావడం వల్లే ఈ అలలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సహజ ప్రక్రియను ‘వెల్ సీచ్’ గా పిలుస్తారని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -