Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ నంబర్ 1

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ నంబర్ 1

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పీఎంవో ‘ప్రగతి’ సమీక్షలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన మూల్యాంకనంలో ఈ విషయం వెల్లడైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాల సైబర్ సెక్యూరిటీ బ్యూరోల పనితీరును తొమ్మిది కీలక పారామితుల ఆధారంగా విశ్లేషించి ఈ ర్యాంకును ఖరారు చేసింది. స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు, ఇ-జీరో ఎఫ్ఐఆర్ అమలు, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మాడ్యూల్, బాధితులకు తిరిగి నగదు ఇప్పించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ వినియోగం, సహ్యోగ్-సమన్వయ పోర్టళ్ల వాడకం, సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణ, సామర్థ్య పెంపుదల వంటి కార్యక్రమాల్లో కనబరిచిన అత్యుత్తమ పనితీరు ఆధారంగా తెలంగాణ ఈ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా S4C కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని కేంద్ర వేదికలను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -