Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హత్యలు, అరాచకాలు చేయడమే ప్రజాస్వామ్య పాలనా.?

హత్యలు, అరాచకాలు చేయడమే ప్రజాస్వామ్య పాలనా.?

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే పుట్టను సూటిగా ప్రశ్నించిన దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

హత్యలు, అరాచకాలు చేయడమే ప్రజాస్వామ్య పాలనా.? అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఈజీసిజి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మండలంలోని రుద్రారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాకరాక ప్రజలు నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యేగా మదుకు అవకాశం ఇస్తే దళితులపై హత్యలు, అరాచకాలు చేసి నియోజకవర్గంలో అలజడి సృటించిన సంగతి ప్రజలకు తెలియదా అన్నారు.

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పాలనలో ప్రజలు నియోజకవర్గంలో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నారని, ప్రజాస్వామ్య పాలన అంటే ఇదన్నారు. అరాచకాలు, హత్యలను ప్రోత్సహించిన పుట్టది నియంత పాలనని ఆరోపించారు. ఇప్పటి పుట్ట, ఆయన అనుచరులు వ్యక్తిగత దూషణలకు పోకుండా ప్రజా సంక్షేమం, ప్రజలకు ప్రజాపాలన ప్రభుత్వంలో అందుతున్న పథకాలపై మాట్లాడాలని హుతువు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నారని రాజయ్య ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు ప్రజాదరణ కోల్పోవడంతో మతిస్థిమితం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు భోగే మల్లయ్య,చిగురు సదయ్య,చంద్రమోహన్, గట్టయ్య,చంద్రగిరి అశోక్,సురేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -