రాత్రింబవళ్లు రైతు వేదికల వద్ద రైతన్నల నిద్ర
నవతెలంగాణ – మిరుదొడ్డి
వేసిన వరి పంటకు సరిపడా యూరియా అందకపోవడంతో రాత్రింబవాలనుకున్న రైతు వేదికల వద్ద రైతులు నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడంతో సకాలంలో యూరియా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తీ చేస్తున్నారు. గత వారం రోజుల నుండి మండలానికి యూరియా రాకపోవడంతో వచ్చిన యూరియాను ఒకే బస్తా ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు రైతులకు యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ధర్నాలు మరొకవైపు యూరియా కష్టాలు తప్పడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు కష్టం వచ్చిందని రైతన్నలు అంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు యూరియాను అందించాలని కోరుతున్నారు.
రైతులకు అందని యూరియా.. పట్టించుకోని అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES