- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
మదర్ డైరీ పాల ఉత్పత్తిదారులకు బకాయి పడ్డ బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం వద్ద గురువారం ఆందోళన చేశారు. పాలశీతలీకరణ కేంద్రం ప్రధాన గేటుకు తాళం వేసి పాల డబ్బాలతో నిరసన తెలిపారు. నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మదర్ డెయిరీ పరిధిలో వీరవేల్లి గ్రామానికి చెందిన సుమారు 160 మంది పాడి రైతులు వీరవేల్లి కేంద్రంలో పాలు పోస్తున్నారన్నారు. వారికి ఎనమిది బిల్లులు పెండింగ్ ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలన్నారు.
- Advertisement -



