- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. యూరియా కొరత ఉంటుందని రైతులు ముందస్తు జాగ్రత్తలు భాగంగా రైతులు అప్రమత్త అవుతున్నారు. శనివారం మండల కేంద్రంలో గల మన గ్రోమోర్ టుకు యూరియా వస్తుందన్న సమాచారాన్ని తెలుసుకున్న రైతులు బారులు తీరడంతో పాటు పాదరక్షాలను లైన్లో ఏర్పాటు చేశారు. యూరియా పంపిణీ పట్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఏవో కరుణాకర్ తెలిపారు. మొక్కజొన్న పంటను సాగు చేసుకున్న రైతులకు మాత్రమే ముందస్తు ప్రాధాన్యత ఇస్తున్నామని, మొక్కజొన్న పంట పేరుతో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, క్లస్టర్ల వారీగా యూరియాను రైతు వేదికల్లో అందజేస్తామని తెలిపారు.
- Advertisement -



