Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు సరిపడ యూరియాని అందించాలి 

రైతులకు సరిపడ యూరియాని అందించాలి 

- Advertisement -

బీఆర్ఎస్ నాయకులు ధర్నా 
నవతెలంగాణ – కాటారం

స్థానిక కాటారం మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే రైతులకి ఇచ్చే యూరియాపై సబ్సిడీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని భావించి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కోటలో యూరియాని అందించకపోవడం వల్ల కొరత వస్తుందని అన్నారు. అంతేకాకుండా పంట చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు యూరియా, పటాస్ కలిపి చల్లితేనే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు యూరియా కొరత వల్ల పంట దిగుబడి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

యూరియా కొరత వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ప్రతి రైతుకు యూరియా ఆందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ అని అన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీలో వద్ద పడిగాపులు ఉండాల్సి వస్తుంది అని అన్నారు. సుమారు వందకట్లు వస్తే 500 మంది రైతులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -