యూరియా కు బదులు నానో యూరియా వాడాలి…
వ్యవసాయ శాఖ మండల అధికారిని పూర్ణిమ…
నవతెలంగాణ – కాటారం: యూరియా దొరకదేమో అని రైతులు అధైర్య పడుద్దని కాటారం వ్యవసాయ శాఖ అధికారిని పూర్ణిమ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పురుగుల మందు దుకాణాలను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరిన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు యూరియా బస్తాలు దొరకడం లేవని గంటల తరబడి దుకాణాల ముందు క్యూ లైన్ లో వేచి చూడాల్సి వస్తుందని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు విడుతల వారీగా యూరియా కొనుగోలు చేస్తే ఇబ్బందులు తలెత్తవని అన్నారు. ఇంకా కూడా యూరియా స్టాక్ తెప్పిస్తున్నామని, రైతులు కంగారు పడవద్దని,యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని అన్నారు. నానో యూరియాతో మంచి ఫలితాలు ఉంటాయని, మొక్క ఎదుగుదలకు నానో యూరియా ఎంతో ఉపయోగపడుతుందని రైతులకు తెలియజేశారు.సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను రైతులు నమ్మొద్దని, ఆందోళనతో సొసైటీలకు పరుగెత్త వద్దని, దఫాలవారీగా రైతులు యూరియా కొనుగోలు చేస్తే యూరియా కొరత ఏర్పడకుండా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారిని రైతులకు తెలిపారు
యూరియా కోసం రైతులు అధైర్యపడవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES