నవతెలంగాణ – వలిగొండ రూరల్
రైతులు యూరియా కోసం ఆందోళన చెందవలిసిన అవసరం లేదని కావలిసినంత నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలవల్ల రైతులు ఇప్పటి వరకు వరి పైరు 2 లక్షల 11 వేల ఎకరాలు సాగు చేశారని, వరి పైరుకు కావలిసినంత కాంప్లెక్స్ ఎరువులు, యూరియా సరఫరా అవుతుందని, ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇంకా ఒక వేయ్యి టన్నుల యూరియా సరఫరా అవుతుందని, రైతులకు కావలిసినంత కొనుగోలు చేయాలని, కావలిసిన దానికన్నా ఎక్కువగా ఎవరు తీసుకోవద్దని, యూరియా వల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దుకాణ యజమానులు రైతులకు అవసరం ఉన్న ఎరువులు ఇవ్వాలని, వేరే వస్తువులు అంటకట్టకూడదని, ఎరువులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయనతో పాటు తహశీల్దార్ దశరథ, మండల వ్యవసాయ అధికారి అంజనీదేవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES