Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోయా పంట డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

సోయా పంట డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

- Advertisement -

తూకం చేసి నెల రోజులు అవుతున్నా ఖాతాలో జామ కానీ డబ్బులు
నవతెలంగాణ – మద్నూర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో మద్నూర్ మార్కెట్ యార్డులు కొనుగోలు జరుపుతున్నారు. రైతుల వద్ద కొనుగోలు జరిపిన సోయా పంటకు తూకం చేసిన రైతులకు నెల రోజులైనా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని సోయా పంట రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నట్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయా పంట కొనుగోళ్ల గురించి నవ తెలంగాణ శుక్రవారం నాడు మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని సందర్శించగా రైతుల వద్ద సోయా పంట కొనుగోలు జరుగుతూనే ఉన్నాయి.

అక్కడ ఉన్న సొసైటీ సిబ్బంది సునీల్ స్వామిని సోయా పంట కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకోగా ఇప్పటివరకు 17,271 బస్తాలు కొనుగోలు జరిగినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు ఇప్పటి వరకు రాలేకపోవడం ఏమిటని అడిగి తెలుసుకోగా డబ్బు లు రాలేని మాట నిజమేనని డబ్బులు రాక కోసం సొసైటీ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేయడం జరుగుతుందని, త్వరలోనే డబ్బులు రైతు ఖాతాలో జమ అయ్యే అవకాశాలున్నట్టు తెలిపారు. ఏది ఏమైనా నెల రోజులుగా సోయా పంట రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తూకమైన రైతులకు డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సోయా పంట రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -