Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటనష్ట పోయిన రైతులను ఆదుకోవాలి 

పంటనష్ట పోయిన రైతులను ఆదుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నందిగామ, అల్జపూర్, యంచ గ్రామాల రైతులకు గోదావరి వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని నందిగామ గ్రామస్తులు అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ సందర్భంగా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నందిగామ, అల్జపూర్, యంచ గ్రామాల రైతులకు గోదావరి వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని అన్నారు. గోదావరి వరదల ప్రభావం ఒక ఎత్తు అయితే, వరదలకు అడ్డంగా ఎస్సారెస్పీ భూమిలో అక్రమంగా చేపల చెరువులు నిర్మాణం చేయడం వల్ల వరద ఉధృతి ఎక్కువై మరింత నష్టం వాటిల్లింది , చేపల చెరువులను తొలగించాలని కోరారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోని నప్టపరిహారం కింద పంట నష్టం ఎకరాకు 50,000/- (మాభై వేల) నష్టపరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, లింగారావు , పోతన్న , మహాదేవ్, సాయిలు, భజన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -