రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి
నవతెలంగాణ – చిన్నకోడూరు
రైతులకు సబ్సిడీ పేరిట రైతులకు ప్రభుత్వం విత్తనాలను అందజేయండంతో రైతులు పూర్తిగా నష్టపోయారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చల్లారపు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన చిన్న కోడూరులో పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించారు.
సబ్సిడీ విత్తనాలతో దెబ్బ, విరుగుతున్న కాండం, పాలు పోయలేని (కంకులు)పూలు, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2026 సంవత్సరం యాసంగి పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రభుత్వం నేరుగా రైతులకు పంపిణీ చేశారు. చిన్న కోడూరు మండల పరిధిలో 500 పొద్ధు తిరుడు బ్యాగులు పంపిణీ చేశారు.
పంట ఏపుగా పెరిగి దాదాపు 3 మీటర్ ఎత్తు పెరగడం జరిగినది ఏరు వ్యవస్థ దృఢంగా లేకపోవడం వలన మొక్కలు నేల మీద పడిపోయింది. పంట వేసిన తర్వాత ఏపుగా పెరిగి మధ్యలోనే విరిగిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాండం మధ్యలోనే విరిగి పువ్వులు ఎదుగుదల నిలిచిపోయి గింజలు పాలు పోసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రైతులు ఆరుగాలంక కష్టపడినా ఫలితం లేదన్నారు. ఒక్క ఎకరానికి 25 నుంచి 30 వేల పెట్టుబడి ఖర్చు అయినది పొద్దుతిరుగుడు నేల మీద పడిపోయి విరిగిపోవడం వలన రైతులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. రైతులకు ఎకరానికి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ రైతులు మువ్వల బాపిరెడ్డి, నరసింహారెడ్డి,రవీందర్ రెడ్డి,బొబ్బల తిరుపతిరెడ్డి, రవి, రమేశ్,దశరథం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



