- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యా సైనిక రవాణా విమానం ఏఎన్-26 కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది చనిపోయారు. వారిలో 23 మంది ప్రయాణికులు ఉండగా, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు క్రిమియా ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. సాంకేతిక లోపంతోనే ఈ విమాన ప్రమాదం జరిగిందని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. విమానంపై ఎలాంటి దాడి జరిగినట్లుగా ఆధారాలు లేవని తెలిపింది.
- Advertisement -



