Monday, October 20, 2025
E-PAPER
Homeక్రైమ్పోలీస్‌ భయం.. ప్రాణం తీసింది

పోలీస్‌ భయం.. ప్రాణం తీసింది

- Advertisement -

పేకాట స్థావరంపై దాడి…
తప్పించుకునేందుకు ఓ యువకుడి ప్రయత్నం
కరెంట్‌ షాక్‌తో ఆ యువకుడు మృతి..
మరోరకంగా ఎస్‌ఐ వివరణ
నవతెలంగాణ-బిచ్కుంద

పేకాట ప్రాణం తీసింది. పేకాటాడుతున్నారనే సమాచారంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేయగా.. తప్పించుకునే క్రమంలో యువకుడు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడ్గీ గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గ్రామానికి చెందిన వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేశారు. పేకాటాడుతున్న వ్యక్తులు తప్పించుకుని పారిపోయే క్రమంలో అదే గ్రామానికి చెందిన వడ్ల రవి (22) పంట పొలాల్లోకి పారిపోతుండగా బోరు మోటర్‌ వద్ద విద్యుత్‌ వైర్‌కు తలిగి కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో రవి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం గ్రామ శివారులో వెతకగా పంట పొలాల్లో మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వెంబడించడం వల్లనే వడ్ల రవి పంటపొలాల్లోకి పారిపోయి విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందినట్టు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై ఎస్సై మోహన్‌రెడ్డిని వివరణ కోరగా.. రవి కాలకృత్యాలకు వెళ్లి పంట పొలాల్లో విద్యుత్‌ వైర్‌పై జారిపడటంతో షాక్‌కు గురై మృతిచెందినట్టు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -