కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాడా’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పా పా’ పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ,’ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ నీరజ కోటకి ఈ చిత్రంతో ఘన విజయం దక్కాలి’ అని తెలిపారు.
‘ఈ సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో ‘పా పా’ పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి’ అని దర్శకుడు బి.గోపాల్ చెప్పారు. ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ, ‘మా జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ చిత్రం తమిళంలో ‘డా డా’ పేరుతో రిలీజై, ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు. అవి అలాగే ఉంటాయని చెప్పే చిత్రమిది. మేము ఈ చిత్రాన్ని తీసుకున్నాక…ఇండిస్టీలోని కొందరు పెద్ద మనుషుల నుంచి తమకు సినిమా ఇవ్వమని ఒత్తిడి చేశారు. ఆ ప్రెజర్‌ను మాటల్లో చెప్పలేం. ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా చేశాం. అయితే రీమేక్ చేస్తే ఒరిజినల్ మూవీలోని ఎమోషన్స్ పండవనిపించింది. ఒక మంచి హ్యూమన్ వ్యాల్యూస్, ఎమోషన్స్ ఉన్న చిత్రమిది’ అని శశికాంత్ చెప్పారు.
భాగ్యరాజ, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్ – శశాంక్ చెన్నూరు, శ్రీకాంత్ నూనెపల్లి, వెంకట్ బొమ్మరాజు, మ్యూజిక్ – జెన్ మార్టిన్, లిరిసిస్ట్ – రవి వర్మ ఆకుల.
ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES