రూ.300 ఇస్తేనే యంత్ర మార్పిడి..
ఆవేదన వ్యక్తం చేస్తున్న డీలర్లు
నవతెలంగాణ – గండీడ్: ఈపాస్ బయోమెట్రిక్ లో డీలర్ల నుంచి కాసులు వసూలు చేస్తున్న ఈపాస్ బయోమెట్రిక్ సిబ్బంది ఒక్కొక్క రేషన్ డీలర్ దగ్గర రూ.300 నుంచి రూ.500 ఇస్తేనే యంత్ర మార్పిడి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి మండల వ్యాప్తంగా 46రేషన్ చౌక ధర దుకాణాలు ఉన్నట్లు వారు తెలిపారు. ఈపాస్ బయోమెట్రిక్ చేయాలంటే పైసలిస్తేనే యంత్ర మార్పిడి చేస్తున్నారని కొందరు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజా పంపిణీలో ప్రజలకు రైతులకు నిత్యవసర సరుకులు అందించాలని ప్రజల పైన డీలర్లపై ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు కాంట్రాక్టర్లు ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
అక్రమాలకు తావు లేకుండా నూతన సాంకేతిక విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం అందులో భాగంగా ఈపాస్ మిషన్ నూతన ప్రయోమెట్రిక్ యంత్రాన్ని డీలర్లకు ఎటువంటి రుసుం లేకుండా ప్రభుత్వమే భరిస్తూ నిత్యవసర సరుకులు ప్రజలకు రైతులకు ఉచితంగా అందించాలని కృషి చేస్తుంటే, ఈ రకంగా యంత్ర మార్పిడి చేసేవాళ్ళుమాత్రం డీలర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు.
ఈపాస్ బయోమెట్రిక్ యంత్ర మార్పిడికి పైసల్ వసూల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES