- Advertisement -
జిల్లా సహకార అధికారి రామ్మోహన్
నవతెలంగాణ – భిక్కనూర్
రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ పెద్ద మల్లారెడ్డి సొసైటీ సీఈవో మోహన్ కు సూచించారు. బుధవారం పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాలలోని సొసైటీ గోదాములను పరిశీలించారు. యూరియా ఇబ్బందులు లేకుండా గోదాములో సరిపడా ఉంచలన్నారు. అనంతరం ఎరువుల రిజిస్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి సురేష్, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -