No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం: ఏవో రాజు

సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం: ఏవో రాజు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా, సోనాల, వాడే ఫతేపూర్ , వ్యవసాయ రైతులకు సోయా పంటపై క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి రాజు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్  పథకం కింద డి ఎస్ బి34 రకం సోయాబీన్ విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా శనివారం క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్త  అనిల్ రెడ్డి , సోయాబీన్ పంటలలోతీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది. 

అలాగే సోయాబీన్ వేసిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి , పొగాకు  లద్దె పురుగు మరియు వేరు కుళ్ళు తెగులు గమనించి తగు నివారణ చర్యలు తెలపడం జరిగింది.వేరు కుళ్ళు తెగులు ఆశించి మొక్కలు చనిపోవడం గమనిస్తే 3గ్రాము కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దె పురుగు నివారణకు 1.65 ఎమ్ ఎల్ 5.25% + ఇమమెక్టిన్ బెంజయోట్ 0.9%లేదా 0.3ml క్లోరాంట్రీనిప్రోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. 

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఎఫ్ పి ఓ చైర్మన్ చట్లవార్ గోపాల్, తడిహిప్పర్గ  ఏఈ వో ,తడి హిప్పర్గ , సొనల , వాడిఫతేపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad