నవతెలంగాణ – బోనకల్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు పోరాటాలు నిర్వహిస్తుందని తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ నాయకులు కిలారి సురేష్, తెలంగాణ అంగన్వాడి టీచర్, హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల విజయలక్ష్మి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని కలకోట, బోనకల్ గ్రామాలలో శనివారం సర్కిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సర్కిల్ సమావేశాలను బండి జయం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాలలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు.
అంగనవాడి టీచర్స్ ను మూడవ తరగతి, హెల్పర్స్ ను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని కోరారు. క్రమబద్దీకరణ జరిగే వరకు నెలకు 26 వేల రూపాయలు కనీస వేతనం రూ పదివేలు పెన్షన్ చెల్లించాలని కోరారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు గ్రాట్యూటీ కోసం సుప్రీంకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఏ రూపంలోనూ ఐసిడిఎస్ను ప్రైవేటీకరించకూడదని కోరారు. ఈ కేవైసీ పేరుతో లబ్ధిదారులను తొలగించకూడదన్నారు. డిజిటలైజేషన్, ఎఫ్ ఆర్ ఎస్ పేరుతో అంగన్వాడీ టీచర్స్ ను హెల్పర్స్ను వేధించకూడదన్నారు.
నెప్ – 2020, వి బి జి రామ్ జి 2025 చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను నిర్వహించాలని కోరారు. వీటి నన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర పండుతుందని ఆ కుట్రకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమ్మెలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశాలలో సిఐటియు మండల కన్వీనర్ గుగులోత్ నరేష్, పెద్ద బీరవల్లి ఉపసర్పంచ్ పెద్ద పోలు రామారావు, అంగన్వాడి యూనియన్ నాయకులు చేబ్రోలు ఉషా, గండు శివ నాగేంద్ర, కళ్యాణపు రాణి, గుగులోతు ఉష, మర్సకుంట్ల మరియమ్మ, రామణ సునీత, కొనకొల్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.



