నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక చట్టాలు అమలు చేయాలని లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమంలో బాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు ప్రధాన రోడ్ల కూడలి(రింగ్ రోడ్డు) లో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా కార్మికుల సంఘం బాధ్యులు కే.భారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ కార్మికులకు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఉండాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని,ఒకవైపు పోరాటాలు నిర్వహిస్తుంటే మరొక వైపున కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు గా మార్చి కార్మికులను బిక్ష గాళ్ళు ను చేసే కుట్రలకు భాజపా ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు.
అనేక త్యాగాల ఫలితమే కార్మిక చట్టాల ని ఆ చట్టాలను సవరించి పెట్టుబడిదారులు కు కార్మికులను బలి పెట్టే కార్మిక కోడ్ లను తీసుకు వస్తుంటే కార్మిక వర్గం చేతులు ముడుచుకొని కూర్చోలేదు అని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు మార్చుకునేంతవరకు అలుపెరిగని పోరాటాలు నిర్వహిస్తారని అంతిమంగా కార్మికవర్గానిదే విజయమని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను భ్రష్టు పట్టించి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేశారని దాని ఫలితంగా నే అన్ని వ్యవస్థలు సంక్షోభంలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసు పాక నరసింహారావు,నాగమణి, తిరుపతమ్మ,విష్ణు కుమారి, సీత,కృష్ణవేణి,సుజాత,గిరిజన సంఘం జిల్లా నాయకులు సోడెం ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.