– మొరిగాడి యాదగిరి వర్ధంతి సభలో
– ఎం ఏ ఇక్బాల్, దూపటి వెంకటేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
సోమవారం రోజున మొరిగాడి యాదగిరి గా 26వ వర్ధంతి సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది .ఈ సందర్భంగా యాదగిరి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ లు మాట్లాడుతూప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం వారు అన్నారు కామ్రేడ్ మోరీగాడి యాదగిరి తను బతికినంత కాలం కార్మికులు కర్షకులు పేదల పక్షుల నిలబడి అనేక పోరాటాలలో భాగస్వామ్యం ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ బలమైన శక్తిగా ఎదగడంలో తనవంతు కృషి చేశారని ప్రజల హక్కుల కోసం,వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని మోరిగాడి యాదగిరి బలంగా నమ్మేవారని అన్నారు.ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మన దేశంలో మాత్రం మూఢాచారాలకు కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సమాజంలో సామాజిక అసమానతలు,మహిళలపై దాడులు రోజురోజు కు పెరిగిపోతున్నాయని మతోన్మాదానికి వ్యతిరేకంగా మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా సామాజిక పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్ మొరిగాడి యాదగిరి నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమం పి సి ఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ చంద్రశేఖర్ సిపిఎం మండల నాయకులు సూదగాని సత్య రాజయ్య మొరిగాడి రమేష్ జూకంటి పౌలు మోరీగాడి అజయ్ వడ్డేమాన్ బాలరాజు ఎండి మతిన్ ఎండి ఖలీల్ ఎర్ర రాజు దండు నాగరాజు గ్యార అశోక్ సాయిని కళ్యాణ్ మసూద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



