నవతెలంగాణ – జన్నారం : మండలంలోని కామన్ పల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన గల్ఫ్ కార్మికుడు కొలిమి కుంట్ల రామాచారి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కామన్ పల్లి గ్రామ గల్ఫ్ సంక్షేమ సమితి సభ్యులు మంగళవారం బాదితునికి రూ. 17800 సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కామన్ పల్లి గల్ఫ్ సంక్షేమ సమితి అధ్యక్షులు కోడిజుట్టు నరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ.. గల్ఫ్ బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. నిరుపేద కలుపు కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కి ఆర్థిక సాయం అందజేసిన తోటి గల్ఫ్ కార్మికులు, విషయం తెలుసుకున్న కామన్ పల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కోడిజుట్టు నరేష్ గారి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రమేష్ మరియు సేవా భావంతో కూడిన సంస్థ సభ్యులు అందరూ కలిసి 17800 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పంచర్ల మల్లేష్, వంగాల శేఖర్, ఓడిపేల్లి అర్జున్, కొలిమికుంట్ల లక్ష్మీపతి, జునుగురు భానుమూర్తి, సాట్లా సాయిశివ, రాష్ట్ర కార్యదర్శి జిలుగురు నాగరాజు పాల్గొన్నారు.
గల్ఫ్ బాధితునికి ఆర్థిక సాయం అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES