- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామపంచాయతీలోని నెమలిగుట్ట తండా కి చెందిన మూడవత్ లోక్య అనే వ్యక్తి ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాదులోని ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తన పదవ తరగతి బ్యాచ్ మిత్రులు హాస్పిటల్ కి వెళ్లి చూసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.26 వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జగపతి, రాజు, శ్రీకాంత్, రామ్, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -