నవతెలంగాణ – రాయపర్తి
చదువుకున స్నేహితురాలి తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో కలిసి చదువుకున్న పదవ తరగతి మిత్రులు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 2005 – 2006 విద్యా సంవత్సరంలో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులులో ఐత అనిత తండ్రి ఉప్పలయ్య ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. దాంతో స్పందించిన 10వ తరగతి మిత్రులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 11 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న మిత్రుల్లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన అందరం కలిసి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పరమేశ్వర్, ఐత రాజేష్, ఐత రాజు, ఉండాది సురేష్, మహేశ్వరి, అనిత, సంబరాజు, విష్ణు, వీరన్న, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
స్నేహితురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES