నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి మిత్రులు బాసటగా నిలిచారు. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన తోడేటి అజయ్ కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అజయ్ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు తనతో కలిసి చదివిన 1996-97 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆర్థిక చేయూతను అందించారు. ఈ మేరకు ఆదివారం ఉప్లూర్ లో పలువురు 1996-97 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమతో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు, అనారోగ్యంతో మృతి చెందిన తొడేటి అజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో మిత్రులందరు కలిసి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
స్నేహితులంతా కలిసి రూ.61వేల 500 నగదును మృతుడు అజయ్ భార్యకు అందజేశారు. వారి కుటుంబానికి ఎటువంటి కష్టం రాకుండా అండగా ఉంటామని భరోసాను ఇచ్చారు.కార్యక్రమంలో 1996-97 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, తిరుపతి, డాక్టర్ అజీమ్, సాయి కృష్ణ, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, తిరుమలేష్, ధన్ రెడ్డి, మధు గౌడ్, నర్సయ్య, ఏవైఎస్ మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



