- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన గడ్డమీది నరసయ్య అనారోగ్యంతో మృతిచెందారు. బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా, వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం కాంగ్రెస్ నాయకులు బాధ్యత కుటుంబానికి రూ.3000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సల్మాన్, రగోతం రెడ్డి, దయానంద్, చంద్రం, సత్యం, శంకర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -