•పైలట్ శ్రీనివాస్ కుటుంబానికి జీవీకే ఈఎంఆర్ఐ సీఈవో పరామర్శ
• రూ.5 లక్షల ఆర్థిక సాయం శ్రీనివాస్ భార్య గంగాసాగర కు అందజేత
నవతెలంగాణ – బాల్కొండ
శ్రీనివాస్ బాల్కొండ మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌లో పైలట్‌గా విధులు నిర్వహిస్తూ 20 జూలై 2025న మరణించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కుటుంబానికి జీవీకే ఈఎంఆర్ఐ ఎస్హెచ్ఓ సుధాకర్ , హెచ్ఆర్ హెడ్ కిరణ్ కిశోర్ , రవీందర్ సోమవారం శ్రీనివాస్ భార్య గంగాసాగర కు ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పర్థి(కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్ జీవీకే ఈఎంఆర్ఐ 108 సంస్థలో 8 సంవత్సరాలుగా అంకిత భావంతో విధులు నిర్వహించారనీ, అతని సేవలకు గుర్తింపుగా సంస్థ తరఫున అతని భార్యకు 5 లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో 108 ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ ,సూపర్వైజర్ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
108 పైలట్ కుటుంబానికి ఆర్థిక చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



