Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిని ఆంజనేయులు గౌడ్ గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు తమ చిన్ననాటి మిత్రుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆంజనేయులు గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రబృందమంతా కలిసి వారి భార్య పిల్లలకు రూ.35000 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు శ్రీనివాస్, కృష్ణ గౌడ్, చెన్నయ్య, యాదయ్య, ఎస్సై లక్ష్మణ్, రాజు, ప్రవీణ్, యాదగిరి, సుదర్శన్, నర్సింలు, నరేందర్, ఆంజి, కృష్ణ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -