Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
మండల కేంద్రానికి  చెందిన ఆరుట్ల రిక్షా మల్లయ్య మరణించిన విషయం కుండె తిరుపతి ద్వారా తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి అదివారం మృతుడి నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం నింపుతూ, తన వంతుగా రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.  కష్టసమయంలో కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన పంపరి లక్ష్మణ్ (వికలాంగులు) వంగ రాజేశ్వర్ రెడ్డి  రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వికలాంగులు, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడంతోపాటు తన సాయి శక్తుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో కుండె తిరుపతి,టీంకు రాజేష్,కోనేటి మహేష్, పరకపల్లి అశోక్, దొంతరమైన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -