- Advertisement -
నవతెలంగాణ-  వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే మహేష్(31) అనారోగ్యంతో  సోమవారం మృతి చెందాడు. మహేష్ కుటుంబాన్ని  మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ , బి ఆర్ ఎస్ నాయకులు పోలే అశోక్, పోలే చంద్ర శేఖర్ లు వేరువేరుగా పరామర్శించి ఓదార్చారు. అనంతరం వెంకటయ్య గౌడ్ రూ.10 వేలు, ఉప్పల  ట్రస్ట్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు  పోలే చంద్ర శేఖర్  రూ. 3 వేల ఆర్ధిక సహాయం మృతుని భార్య కు అందజేశారు. మృతునికి  భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పోలే అశోక్, పోలే తిరుపతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -

                                    

