Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం

చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ-కోహెడ 
మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మల్కి ఆదిరెడ్డి ఇటీవల మరణించగా, ఆయన కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. ఎస్సెస్సీ 2002 బ్యాచ్‌కు చెందిన మిత్రులు కలిసి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని ఆదిరెడ్డి భార్య రజితకు అందజేశారు.

ఈ సందర్భంగా మిత్రులు కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, అవసరమైనప్పుడు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -