Thursday, October 16, 2025
E-PAPER
Homeసినిమాతొలి లగ్జరీ మల్టీప్లెక్స్‌'కాన్‌ప్లెక్స్‌ సినిమాస్‌' ప్రారంభం

తొలి లగ్జరీ మల్టీప్లెక్స్‌’కాన్‌ప్లెక్స్‌ సినిమాస్‌’ ప్రారంభం

- Advertisement -

హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్‌ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్‌ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన ఈ థియేటర్‌ ఓపెనింగ్‌కి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, హీరో సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాతలు ఎస్‌.రాధాకష్ణ (చినబాబు), నాగవంశీ, ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ,’ఈ థియేటర్‌ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ థియేటర్‌ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్‌. థియేటర్‌ చాలా బాగుంది. స్క్రీన్‌ చాలా నచ్చింది’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు.
‘థియేటర్‌ చాలా చాలా బాగుంది.

ఇలాంటి థియేటర్‌ను ప్రారంభించడం అభినందనీయం’ అని నిర్మాతలు ఎస్‌.రాధాకృష్ణ, నాగవంశీ అన్నారు. విజ్ఞాన్‌ యార్లగడ్డ మాట్లాడుతూ,’ఇదొక గుజరాత్‌ బ్రాండ్‌. దేశ వ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే మొదటి థియేటర్‌. యూఎస్‌లో మాస్టర్స్‌ చేసిన మేం ముగ్గురం కలిసి ఇక్కడ ఈ థియేటర్‌ను ప్రారంభించాం. ఆడియెన్స్‌కి లగ్జరీ సీటింగ్‌, అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరి యెన్స్‌ను అందించాలని దీన్ని ప్రారంభించాం. మూడు స్క్రీన్లలో కలిపి 171 సీటింగ్‌ కెపాసిటీ ఉంటుంది. మరికొన్ని నెలల్లో రెండు స్క్రీన్లను యాడ్‌ చేస్తాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలోని చాలా ఏరియాల్లో స్క్రీన్లను ప్రారంభిం చాలని అనుకుంటున్నాను. అన్ని చిత్రాలకు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోని ఇక్కడ లాంచ్‌ చేస్తాం. ‘ఓజీ’ మూవీతో మా స్క్రీన్లను స్టార్ట్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చి మా థియేటర్‌ను సందర్శించండి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -