Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండలంలో జోరుగా చేపల విక్రయాలు..

మండలంలో జోరుగా చేపల విక్రయాలు..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలో ఆదివారం చేపల విక్రయాలు జోరుగా సాగాయి. మృగశిర కార్తె(మిరుగు)ను పురస్కరించుకొని మత్స్యకారులు ఉదయాన్నే చేపలు పట్టి మార్కెట్ కు తెచ్చారు. కొనుగోలుదారులతో చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. మృగశిర కార్తె తొలి రోజున చేపలను తింటే అస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు రావనేది ప్రజల నమ్మకం.మామూలు రోజుల్లో కిలో రూ.160 ఉండే చేపలను మత్స్యకారులు మిరుగును ఆసరాగా చేసుకుని రూ. 180 నుండి రూ.200 వరకు విక్రయించారు. మత్స్యకారులు ధరలు పెంచి చేపలు అమ్మినప్పటికిని కొనుగోలుదారులు అదేమీ లెక్కచేయకుండా చేపలు కొనేందుకు పోటీపడ్డారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img