Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపాఠశాల సమీపంలో చేపల విక్రయాలు..

పాఠశాల సమీపంలో చేపల విక్రయాలు..

- Advertisement -

దుర్వాసనతో విద్యార్ధులకు అవస్థలు..
ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు..
నవతెలంగాణ జోక్యంతో ఖాలీ చేయించిన సీఐ నాగరాజు రెడ్డి..
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యాపారం ఏదైనా లావాదేవీలు,లాభనష్టాల వ్యవహారమే ప్రధానం కానీ పరిసరాలు ప్రాధాన్యం కానీ ప్రజలు పడే అవస్థలు ముఖ్యం కాదు. ఈ కోవలోకే వస్తుంది పాఠశాల సమీపంలో చేపల విక్రయాలు తంతు. ప్రత్యేకించి నిర్దేశించిన ప్రాంతంలో లేక సొంత ప్రాంగణంలో క్రయవిక్రయాలు జరగాల్సిన పచ్చి చేపల వ్యాపారం గత కొన్ని నెలలు గా రోడ్డు ను ఆనుకుని రద్దీగా ఉండే ప్రధాన కూడలి లో పైగా మూడు ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ అనుకుని సాగుతుంది.

పచ్చి చేపల వ్యాపారులు అవశేషాలను అక్కడే వదిలి వెళ్ళడంతో అవి కుళ్ళి దుర్గంధం వెదజల్లుతోంది.ఈ దుర్వాసనతో ఆయా పాఠశాలల విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే విషయం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత మున్సిపాల్టీ కమీషనర్ కు గత విద్యాసంవత్సరం మే పిర్యాదు చేసారు. అయినా పాఠశాలను అనుకునే చేపలు విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు.

ఆదివారం నవతెలంగాణ దృశ్యాలను ఫొటోలు తీసి కమీషనర్ కు,సీఐ నాగరాజు రెడ్డి,ఎంఈఓ ప్రసాదరావు కు,పలు వాట్సాప్ గ్రూప్ ల్లో ఉదయం 9.30 షేర్ చేసి అక్కడ చేపలు విక్రయాలు జరగడం వల్లే అనర్ధాలు వివరించడం జరిగింది.దీంతో వెంటనే స్పందించిన సీఐ నాగరాజు రెడ్డి అదనపు ఎస్.ఐ రామ్మూర్తి తో కలిసి ఉదయం 11 గంటలకే పాఠశాల వద్ద చేపలు విక్రయించే వ్యాపారులను సంత ప్రాంగణంలోకి తరలించారు. దీంతో ఎంతో కాలంగా అవస్థలు పడుతున్న విద్యార్ధులకు ఉపశమనం కలిగిందని ఎంఈఓ ప్రసాద్ రావు,హెచ్.ఎం హరిత లు పోలీస్ సిబ్బందిని అభినందించారు. నవతెలంగాణ జోక్యాన్ని ప్రశంసించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img