Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లరాదు..

మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లరాదు..

- Advertisement -

జిల్లా మత్స్య శాఖ అధికారి రాజారామ్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

మూసి  నది, కాలువలు వాగులలో వరద ప్రవాహము ఎక్కువ ఉన్నందున వీటి ప్రాంతాల సహకార సంఘాల సభ్యులు జాగ్రత్తగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని జిల్లా మస్య శాఖ అధికారి రాజారాం తెలిపారు. మన జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున ప్రతి సంఘం నుండి  ఐదుగురు గజ ఈతగాళ్లును  ఎంపిక చేసి వారి యొక్క పేరు ఫోన్ నెంబరు సమాచారం  మా ఆఫీస్ నందు తెలపాలని కోరారు.  చెరువులు , చెరువు యొక్క తూములని పరిశీలించి గండి పడే విధంగా ఏమైనా ఉంటే అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలోని మత్స్యకారులకి తెలియజేయునది ఏమనగా భారీ వర్షాలు ఉన్నందున మీ సంఘము నుండి గజఈతాగాళ్ళును రెడీగా ఉంచుకొని ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై సహాయ కార్యక్రమాలు అందించగలరని విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -