- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లీ మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తరగతులను. మంగళవారం ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతుల్లో తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ పాఠ్యాంశాలకు సంబంధించి డిజిటల్ రూపంలో తరగతులు నిర్వహించారు. మద్నూర్ మండలానికి చెందిన 71 మంది, డోంగ్లీ మండలానికి చెందిన 30 మంది ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు హజరు అయినట్లు సెంటర్ ఇన్ఛార్జ్ టి శ్రీనివాస్, ఎం. సునీల్ తెలిపారు. రిసోర్స్ పర్సన్స్ శ్రీధర్, గంగారాజం, దశరథ్, స్వామి, కె. లక్ష్మణ్, బి. అనిత, సాయిలు, మమత, సూర్యకాంత్, యాదవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -