– ఏరియా ఆస్పత్రిలో మెరుగు అవుతున్న వైద్యసేవలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి లో ప్రసూతి వైద్యసేవలు మెరుగు పడుతున్నాయి. గతం ఏ మాత్రం కాన్పు కష్టం అయినా కొత్తగూడెం మో లేక ఖమ్మం మో తరలించేవారు. ప్రస్తుతం కష్టాలను అధిగమించి నాణ్యమైన సేవలు స్థానికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి బుధవారం తెల్లవారు జామున 5 గంటల లోపు అంటే అయిదు గంటలు లోపు ఐదుగురు నిండు గర్భిణీ లకు విధుల్లో ఉన్న వైద్యసిబ్బంది సునాయాసంగా సాధారణ కాన్పులు జరిపి వారి పనుల్లో ప్రతిభను కనబరిచారు. ఈ కాన్పు ల్లో ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.తల్లులు,బిడ్డలు ఇరువురు సంపూర్ణ ఆరోగ్యం గా ఉన్నారని వైద్యులు తెలిపారు .
ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి (సూపరింటెండెంట్) డాక్టర్ రాధా రుక్మిణి మాట్లాడుతూ సాధారణ కాన్పులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని,ఇక్కడ రోగులకు ప్రభుత్వ సేవల మీద నమ్మకం కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతంలో సురక్షిత సుఖ ప్రసవాలు కోసం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి కి వ్యయ ప్రయాసలకోర్చి గర్భిణి స్త్రీలు వారి కుటుంబ సభ్యులు వెళ్లే వారని,కానీ నేడు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,జిల్లా కలెక్టర్,డీసీ హెచ్ రవి బాబు సహాకారాలుతో 24 గంటల ప్రసూతి వైద్యుల పర్యవేక్షణ,ఆపరేషన్ థియేటర్, మెటర్నిటీ వార్డులలో ఏసీ సౌకర్యం,ఇతర మౌలిక వసతులు,సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి అని తెలిపారు.
అలాగే రోగులకు టిఫా స్కాన్ తో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి అని అన్నారు.తద్వారా గర్భిణి మహిళలు స్థానిక ఆసుపత్రి లోనే ప్రసవాలు కు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక హెడ్ నర్సింగ్ ఆఫీసర్ ఆశ వర్దిని, నర్సింగ్ ఆఫీసర్ వీర కుమారి,ఏఎన్ఎం సుజాత, పీసీ అనూష తదితరులు పాల్గొన్నారు.



