Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18వేలు నిర్ణయించాలి : సీఐటీయూ

ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18వేలు నిర్ణయించాలి : సీఐటీయూ

- Advertisement -

– కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్

– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకి వినతి

నవతెలంగాణ కంఠేశ్వర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకిచ్చిన హామీలను నిలబెట్టుకొని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18వేలు నిర్ణయించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం మూడు నెలల బకాయి వేతనాలు ఇతర సమస్యలను అసెంబ్లీ సమావేశాలలో చర్చకు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలలో మేము ఆశ వర్కర్ల సమస్యలపై లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాదులో సుమారు ఈ జిల్లాలో 1230 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 50 లక్షల ఇన్సూరెన్స్. 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్సపోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి.

వీటికి తోడు పారితోషికాలు కూడా ప్రతి నెలా రావటం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్ హేచ్ ఏం కు నిధులు పెంచాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. కావున పై సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా ఎన్ హెచ్ ఎం కు సరిపడా నిధులు కేటాయించాలి.జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి.ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500/-ల పారితోషికాలను వెంటనే అమలు చేయాలి. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పి.ఆర్.సి. ఎరియర్స్ వెంటనే చెల్లించాలి.

2022 నుండి 2025 వరకు నాలుగు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలి. ఎగ్జామ్ డ్యూటీలకు డబ్బులు చెల్లించాలి.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులకు వెంటనే జి.ఓ. లు ఇవ్వాలి.పి.ఎఫ్., ఇ. ఎస్.ఐ., సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి.ఎ.ఎన్.ఎం. జి.ఎన్.ఎం. ట్రైనింగ్ ప్పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం వెంటనే నిర్ణయించాలి.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎ.ఎన్.సి., పి.ఎన్.సి. తదితర టార్గెట్స్ను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేయాలి.రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి.

సంవత్సరానికి 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు, 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులివ్వాలి.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. ఆశాలతో ఎన్ సి డి ఆన్లైన్ పని చేయించకూడదు. స్పూటమ్ డబ్బాలు మోయించకూడదు.పూనమ్ క్లాత్తో కూడిన క్వాలిటీ యూనిఫాం సప్లై చేయాలి.ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటిని గుర్తించాలి.ప్రభుత్వ అన్ని ఆస్పత్రుల్లో ఆశాలకు ప్రత్యేకంగా రెస్టు రూమ్లు ఏర్పాటు చేయాలి. ఆశాలకు పనిభారం తగ్గించాలి. పారితోషికం లేని పనులు చేయించకూడదు.ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలి. సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా నాయకులు సుకన్యా, రేణుక, రేణుక , అనీఫా, అనిషా, పద్మ , కవిత, శ్రీలత, రాధా, పుష్ప, ఉమా, పద్మ సుమలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -