Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లలోకి చేరిన వరద నీరు

ఇందిరమ్మ ఇండ్లలోకి చేరిన వరద నీరు

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండలంలోని కందకుర్తి ఇందిరమ్మ కాలనీలోకి నీరు రావడంతో వారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. ఉదయం వెళ్లి చూడగా తమ ఇళ్లలోకి నీరు నిండి ఉండడంతో వాటిని తొలగించడానికి వారు నానా అవస్థలు పడ్డారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసి ముద్దయ్యానీ, గోధుమలు, బియ్యం తడిసిపోయాయని నిర్వాసితులు పేర్కొన్నారు. ఇంటి ముందు మోకాలు లోతు నీరు నిలిచి ఉండడంతో వారు తమ ఇళ్లలోని వస్తువులను ఆరబెట్టుకున్నారు. ఎగువ భాగం నుంచి మళ్లీ నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో చేసేదిలేక వారు పునరావాస కేంద్రానికి తిరిగి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -