ఎక్కువసేపు బయట ఉంచకుండా ఎండ తగలకుండా చూసుకోవాలి: ఏడి డాక్టర్ గంగాధరయ్య
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
పశువులకు కాలికొంటూ వ్యాధి నివారణకు ఇచ్చే ఎఫ్ఎంబి వ్యాక్సిన్లు చల్లదనంలో ఉంచాలని ఎక్కువసేపు బయట ఉంచకుండా ఎండ తగలకుండా చూసుకోవాలని ఏడి డాక్టర్ గంగాధరయ్య మంగళవారం అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి తొర్లి కొండ గ్రామాలలో కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి తనిఖీ చేశారు. పశువులకు వేసే ఎఫ్ఎండి వ్యాక్సిన్లు అతి జాగ్రత్తగా వెంటాది వెంట కూల్ బాక్సులలో ఉంచుతూ బయట ఎక్కువసేపు ఉంచకుండా పశువులకు హెచ్ఎండి వ్యాక్సిన్ వేసినట్టు అయితే సరైన విధంగా పనిచేయడం జరుగుతుందని సిబ్బందికి రైతులకు తెలియ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ఆశ్రిత పశు వైద్య సిబ్బంది గోపాల మిత్రులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్ఎండి వ్యాక్సిన్ చల్లదనంలో ఉంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



