Saturday, December 20, 2025
E-PAPER
Homeజిల్లాలుసమస్యాత్మక గ్రామాలపై దృష్టి..

సమస్యాత్మక గ్రామాలపై దృష్టి..

- Advertisement -

-పోలీస్ కవాతులో ఏసీపీ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి 

ఎన్నికల దృష్ట్యా మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని..ఎన్నికలు సజావుగా జరిగేల అభ్యర్థులు సహకరించాలని ఏసీపీ రవీందర్ రెడ్డి సూచించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పోలీస్ శాఖ భరోసా కల్పిస్తూ శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లతో పాటు వడ్లూర్, బేగంపేట గ్రామాల్లో ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య ప్రత్యేక పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియామళి అమల్లో ఉంటుందని..నియామవళి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఏసీపీ హెచ్చరించారు. ఏఎస్ఐ శంకర్ రావు,ఓదేలు,పోలీస్ సిబ్బంది,ప్రత్యేక పోలీస్ బృంద పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -