దానికోసం విద్యావ్యవస్థలో మార్పులు తెస్తాం : జేఎన్‌టీయూహెచ్ గ్లోబల్ అలూమ్ని మీట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యువతకు వృత్తినైపుణ్యాల్లో మెరుగైన శిక్షణ ఇచ్చేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘గ్లోబల్ అలూమ్ని మీట్ – 2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేలా ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
జేఎన్‌టీయూహెచ్‌లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అలూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. యువ ఇంజనీర్ల ఆలోచనావిధానం మారాలనీ, ఉద్యోగార్థిగా కాకుండా పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మార్గనిర్దేశం చేశారు. పుస్తక జ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మెన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వరరావు, రెక్టార్ డాక్టర్ కే విజయ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువతకు వృత్తినైపుణ్యాలపై ఫోకస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



